ఉద్యోగ , ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం సుస్వాగతం పి అర్ టి యు పినపాక మండల శాఖ ......

E-TDS Filing Q4 (Jan-Feb-March) FY 2023-24 Due Date is 31st May 2024.......

ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు


🌻*_సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:_*🌻
*_🎇FR-55 ప్రకారం సస్పెండు అయిన ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు_*.
*_🌅సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూన్నట్లయితే అతనికి పదోన్నతి(Promotion) కల్పించటకు అవకాశము లేదని ప్రభుత్వం_* *_G.O.Ms.No.257 తేది:10-06-1999 ద్వారా తెలియజేసింది_*.
*_🎇ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో పదవీ విరమణ వయస్సు వచ్చినయెడల అతనిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్న యెడల అట్టివానికి భంగం కలగకుండా ఆ ఉద్యోగిని పదవీ విరమణ గావించవలెను._*
*(G.O.Ms.No.64 F&P తేది*: *01-03-1979)*
*(Section 3 of A.P.Public Employment of age of super annuation Act 1984)*
*_🌅సస్పెన్షన్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు పుర్తిగాకుండా అసంపూర్తిగా ఉన్న సమయంలో సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి చనిపోయిన యెడల,సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం_* *G.O.Ms.No.275 F&P తేది:08-08-1997 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది*.
*_🎇AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూలు.30 ప్రకారం సస్పెన్షన్ ఉన్న ఉద్యోగి క్రమశిక్షణా చర్యల గురించి విచారణ పూర్తికాకముందే ఏ కారణము చేతనైన తన పదవికి రాజీనామా చేసిన యెడల అట్టి రాజీనామా అంగీకరించకూడదు_*
*_🌅రెండు సం॥ కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి యొక్క క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో పెడుతూ వెంటనే సర్వీసలోకి పునరుద్దరించవలెనుకొన్ని ప్రత్యేక పరిస్థితులలలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగిన్చవచ్చు_*
*(G.O.Ms.No.526 GAD తేది:19-08-2008)*
*_🎇సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి జీవనాధారంగా వున్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి,అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం FR-53 లోని నియమ నిబంధనలకులోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది._*
*_🌅సస్పెండ్ అయిన ఉద్యోగిని తిరిగి సర్వీసులో పునరుద్దరించే Resistance)సందర్భంలో జారీచేయవలసిన ఉత్తర్వుల ఫారం ప్రభుత్వం_* *G.O.Ms.No.82 GAD తేది:01-03-1996) ద్వారా నిర్దేశించింది.*
*_🎇సస్పెండ్ అయిన ఉద్యోగి తాను సస్పెండ్ అయిన తర్వాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/వ్యాపారం గాని యితరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధృవీకరణ పత్రము అధికారికి అందజేయవలెను_*
*_🌅జీవనాధార భత్యము సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు. జీవనాధార భత్యము(Subsistance Allowance) చెల్లింపులు తిరస్కరించటం శిక్షించదగ్గ నేరము._*
*(Govt.memo.no.29730/A/458/A2/FR-II/96/F&P తేది:14-10-1996)*
*_🎇సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో లేని కాలం(Non Duty) గా పరిగణించినప్పుడు ఉద్యోగి అభ్యర్ధనమేరకు సెలవుగా మార్పు (Convert) చేసినపుడు అతని సెలవు జీతములో నుంచి అతనికి ఇదివరకే చెల్లించియున్న జీవనభృతి లో మొత్తం రికవరీచేయాలి_*.
*_🌅ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయ సమ్మతము గాని సస్పెండ్ చేసే బదులు అతనిని బదిలీచేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి బదిలీ కాబడిన కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన యెడల అట్టి సెలవు మంజూరుచేయకూడదు_*.
*(Govt.circular.memo.no.595SP/B/2000 తేది:21-09-2000 & Govt.memo.no.1733/ser.C GAD 03-08-1967)*
*🎇ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగాసస్పెండు చేయకూడదు* *ఆ విధంగా సస్పెండు కాబడిన ఉద్యోగికి జీవనాధార భృతి* *చెల్లించటమే కాకుండా,అతని* *సేవలు కూడా ప్రభుత్వం* *పోగొట్టుకుంటుoది* *అందువలన అనవసర కారణాల వల్ల ఉద్యోగిని* *సస్పెండు చేయకూడదు* *అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది*.
*_(Govt.memo.no.2213/ser.C/66-1 GAD తేది:30-11-1966 & memo no.4993/police-C/69-1 తేది:08-12-1969_*.

*మహిళా ఉద్యోగుల ప్రత్యేక జీవోలు*

👉పురుషుల కంటే మహిళా టీచర్లకు 5CLs అధికం (G.O.Ms.No.374, Edn, Dt:16-3-1996)
👉ఫ్యామిలీ ప్లానింగ్కు 14 రోజులు సెలవు ఇస్తారు(G.O.Ms.No.1415, M&H, Dt:10-06-1968)
👉మొదటి ఆపరేషన్ ఫేయిలైతే రెండో ఆపరేషన్ కు14 రోజులు సెలవు ఇస్తారు
(G.O.Ms.No.124, F&P, Dt:13-04-1982)
👉లూప్ వేయించుకొన్న రోజు స్పెషల్ CL ఇస్తారు (G.O.Ms.No.128, F&P,Dt:13-04-1982)
👉ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజెషన్ చేయించుకున్న ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు
(G.O.Ms.No.102,M&H,Dt:19-02-1981)
👉గర్భసంచి తొలగిస్తే సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు
(G.O.Ms.No.52, Fin,Dt:1-04-2011)
👉180 రోజులు ప్రసూతి సెలవు ఇస్తారు ఇది ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది
(G.O.Ms.No.152, Fin,Dt:04-05-2010) &
(G.O.Ms.No.38, F&P, Dt:13-08-1992)
👉సమ్మర్ హాలిడేస్ లో ప్రసవించిన,ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు.(G.O.Ms.No.463,Edn,Dt:04-05-1979)
👉అబార్షన్ కు 6 వారాలు సెలవు ఇస్తారు.(G.O.Ms.No.762,M&H,Dt:11-08-1976)
👉వివాహానికి రూ.75,000 అప్పుగా ఇస్తారు.దీన్ని 70 వాయిదాల్లో 5.50% వడ్డీ తో చెల్లించాలి
(G.O.Ms.No.39 F&P,Dt:15-04-2015).

*SHORT TERM HOLIDAYS*   * SUFFIX - PREFIX *పై వివరణ*
👉
 15రోజులు మించిన సెలవు కాలాన్ని *వెకేషన్* అంటారు.
15 రోజుల లోపు సెలవులను మిడ్ టర్మ్ హాలిడేస్ అంటారు.
👉 *10 రోజులకు పైబడి 15 రోజులకు మించని మిడ్ టర్మ్ సెలవుల సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున ,తెరిచే రోజున తప్పక హాజరు కావాలి.* (Rc .No.10324/E4-2/69,Dt :7-11-1969)
👉 *మిడ్ టర్మ్ హాలిడేస్ 10 రోజుల లోపు ఉన్న సంధర్భంలో పాఠశాల మూసివేసే రోజున లేదా తెరిచే రోజున*
*గైర్హాజరు అయిన సంధర్భం లో సాధారణ సెలవు(CL) పెట్టుకొనవచ్చును.*
👉 *మిడ్ టర్మ్ హాలిడేస్ 14 రోజులకు మించిన సంధర్భం లో పాఠశాల మూసివేసే రోజు లేదా తెరిచే రోజు EL మంజూరుకు అవకాశం కలదు.* (Rc.No.815/E1/99 Dt : 1-9-1999) 
              
🌈 సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No122 తేది:11-04-2016)
🌈 మరణించిన ఫామిలీ మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.20,000 చెల్లిస్తారు.పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు.
(G.O.Ms101
తేది:21-04-2015)
🌈 ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No.38
తేది:28-05-2013)
🌈 ఫామిలీ పెన్షనర్ చనిపోతే కుటుంబంలో ఎవరూ లేనిచే వారసులకు చెల్లిస్తారు.
(G.O.Ms.No.136
తేది:29-06-2011)
🌈 నాన్ గజిటెడ్ ఉద్యోగులు,ఉపాధ్యాయుల పిల్లలకు LKG నుండి ఇంటర్ వరకు Rs.2500 ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు.
(G.O.Ms.No.27
తేది:24-09-2015)
🌈 ప్రాధమిక,ప్రాధమికోన్నత,ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవేన్స్ చెల్లిస్తారు.
(G.O.Ms.No.56
తేది:02-05-2015)
🌈 ఉద్యోగులుగా పనిచేయు భార్య,భర్తల 
ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే Rs.7500 వడ్డీలేని ఫేస్టివల్ అడ్వాన్స్ మంజూరు చేస్తారు.
(G.O.Ms.No.39
తేది:15-04-2015)
🌈 PHC Allowance బేసిక్ పే పై 10% లేదా max Rs.2000 మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.103
తేది:24-07-2015)
🌈 అంధ ఉపాధ్యాయులకు రీడర్ అలవెన్స్ మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.04
తేది:19-03-2016)


       కుటుంబ నియంత్రణ ప్రత్యేక క్యాజువల్ లీవులు

💊కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స(TUBECTOMY) చేయించుకున్న మహిళా ఉద్యోగికి 14 రోజులు,పురుష ఉద్యోగికి 6 రోజుల ప్రత్యేక క్యాజువల్ సెలవు మంజూరు చేస్తారు.
(G.O.Ms.No.1415 M&H,Dt:10-6-1968)
💉కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స భార్య చేయించుకున్న సంధర్భంలో ఆమెకు సహాయం చేయుటకు భర్తకు 7 రోజుల సెలవు మంజూరు చేస్తారు. (G.O.Ms.No.802 M&H Dt:21-4-1972)
💊గర్భనిరోధక సాధనం(లూప్) అమర్చుకున్న రోజు స్పెషల్ సి.ఎల్ మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.128 F&P Dt:13-4-1982)
💉రీకానలైజేషన్ ఆపరేషన్ కై మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే మేరకు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.102 M&H Dt:19-2-1981)
💊మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్ (గర్భసంచి తొలగింపు) చేయించుకున్నప్పుడు 45 రోజుల ప్రత్యేక సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.52 Fin Dt:1-4-2011)

      మెడికల్ రీయంబర్స్మెంట్ సమాచారం సంబంధిత ఉత్తర్వులు:

 ప్రభుత్వ,పంచాయతీ రాజ్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు నిర్ధారింపబడిన వ్యాధులకు ప్రభుత్వ గుర్తింపుపొందిన ఆసుపత్రులయందు చికిత్సకై రీయంబర్స్మెంట్ విధానం వర్తించును. (G.O.Ms.No.74 తేది:15-03-2015)
 ఉద్యోగులకు,పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రీయంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును. (G.O.Ms.No.397 తేది:13-11-2008)
 కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(CGHS) లో నిర్ణయించబడిన ప్యాకేజి ప్రకారం రీయంబర్స్మెంట్ ఖర్చులు చెల్లిస్తారు.
 వైద్యఖర్చులు రూ.50,000 అయితే సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి(DEO) అంతకు మించినచో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(DSE) కి పంపాలి.
ప్రైవేట్ రెఫరల్ గుర్తింపుపొందిన ఆసుపత్రులనందు కూడా 10% కోత లేకుండా పూర్తిమొత్తం చెల్లిస్తారు.
(G.O.Ms.No.68
తేది:28-03-2011)
 కీమోథేరపీ,రేడియోథేరపీ,డయాలసిస్, క్యాన్సర్,కిడ్నీ,గుండెజబ్బులు,ఎయిడ్స్,నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రులయందు అవుట్ పేషంట్ వైద్యఖర్చులు కూడా చెల్లిస్తారు.
 కంటి చికిత్స,దంత చికిత్సలకు గరిష్ఠంగా రూ.10,000 చెల్లిస్తారు.కాస్మోటిక్ డెంటల్ సర్జరీకి రీయంబర్స్మెంట్ సౌకర్యం లేదు.దంతచికిత్స సర్వీసులో (లేదా) జీవిత కాలంలో 3సార్లు చేయించుకోవచ్చును.
 రోడ్డుప్రమాదాలు సంభవించినపుడు మాత్రమే ప్రాణాపాయ రక్షణ నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ గుర్తింపులేని ఆసుపత్రులలో చికిత్స పొందినను రీయంబర్స్మెంట్ చెల్లిస్తారు.స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదయిన FIR కాపిని జతచేయాలి.
(G.O.Ms.No.175
తేది:29-05-1997)
40సం॥ నుండి రిటైర్ అయ్యేవరకు (లేదా) జీవితకాలంలో 3 సార్లు మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే అవకాశం కలదు.
(G.O.Ms.No.105
తేది:09-04-2007)
 మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులు పూర్తిగా డిపెండెంట్స్ అయినచో రీయంబర్స్మెంట్ అవకాశం కలదు.
(DSE Rc.No.350/D2-4/2008
తేది:15-04-2008)
 కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.(G.O.Ms.No.87 తేది:28-02-2004)
 హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయిన తేది నుండి 6 నెలలలోపు,చనిపోయినచో 8 నెలలలోపు DEO/DSE కి ప్రతిపాదనలు పంపాలి.
 రీయంబర్స్మెంట్ పొందుటకు సమర్పించవలసిన సర్టిఫికెట్లును Rc.No.8878/D2-4/09 తేది:02-09-2009 ద్వారా వివరించారు.